Tuesday, 20 October 2020

ప్రముఖ నటుడు 30 ఇయర్స్ పృథ్వీకి రోడ్డు ప్రమాదం.. కారు ధ్వంసం

ఇటీవలే కరోనా సోకి కోలుకున్న ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, 30 ఇయర్స్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ రోజు (అక్టోబర్ 20) మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో పృథ్వీ కారులోనే ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని పృథ్వీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రమాదం తాలూకు పిక్స్ షేర్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆసుపత్రి సమీసంలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్‌ వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టిందని పేర్కొంటూ ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైందని తెలిపారు. దీంతో చుట్టుపక్కల జనాలు గుమిగూడారని చెప్పారు. ఈ మేరకు ధ్వంసమైన కారు ఫొటోను షేర్‌ చేసిన పృథ్వీ టీమ్.. ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆయన పరిస్థితిపై ఆరా దీస్తున్నారు జనం. Also Read: 30 ఇయర్స్ పృథ్వీగా టాలీవుడ్‌లో ఫేమస్ అయిన ఆయన.. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పనిచేసి ఓ మహిళతో ఆడియో టేపుల వ్యవహారం వెలుగుచూడటంతో తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే ఈ ఇష్యూలో ఆ వాయిస్ తనదికాదని పృథ్వీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jcbTQ9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...