Wednesday, 23 September 2020

RGV: ‘సైకో వర్మ’ సాంగ్ టీజర్.. నీ వరసేందిరో వోడ్కా వర్మ!!

నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ మళ్ళీ మెగాఫోన్ పట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నట్టి లక్ష్మి సమర్పణలో నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ నిర్మిస్తున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీస్తోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో, తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్ర టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు నట్టికుమార్ వెల్లడించారు. ‘పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి..’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట వీడియో సాంగ్‌ను ఈనెల 26న విడుడల చేస్తున్నారు. అయితే, ఆ పాట టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. 30 సెకెన్ల నిడివి ఉన్న ఈ సాంగ్ టీజర్ మంచి ఫోక్ బీట్‌తో అలరిస్తోంది. ఈ పాట గురించి నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. ‘‘రామ్ గోపాల్ వర్మ అభిమానిగా ఈ చిత్రంలోని హీరో క్రాంతి కనిపిస్తాడు. వయోలెన్స్, రొమాన్స్ అంశాలతో చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. కూడా ఈ చిత్రంలో కనిపించబోవడం విశేషం. ఒకప్పుడు ‘శివ’, ‘సర్కార్’, ‘రంగీలా’ వంటి అద్భుత చిత్రాలను తీసిన వర్మ ఇప్పుడు తన పంథాని మార్చి తీస్తున్న విధానాన్ని పోలుస్తూ ఈ చిత్రంలో ఓ మంచి పాటను చిత్రీకరిస్తున్నాం. ‘పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి..’ అంటూ సాగే ఈ పాట చిత్రీకరణతోనే షూటింగును మొదలుపెట్టాం. హీరో, హీరోయిన్‌తో పాటు పలువురు డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులు ఈ పాటలో పాల్గొన్నారు. పాట అద్భుతంగా వచ్చింది’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎస్‌.ఏ.ఖుద్దూస్‌ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hWy3oH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...