Sunday, 6 September 2020

Pushpa: పుష్పలో మరో హీరో! అది కూడా నందమూరి కాంపౌండ్ నుంచి.. సుకుమార్ సీక్రట్ ప్లాన్

స్కెచ్చేయాలన్నా.. దాన్ని పక్కాగా అమలు చేయాలన్నా తర్వాతే ఇంకెవరైనా. అందుకే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారాయన. ఎంచుకునే కథలతో పాటు ఆయా సినిమాల్లో నటీనటుల ఎంపిక విషయంలో సుక్కు ప్లాన్ చేసే విధానమే ప్రత్యేకం. తన సినిమాల్లోని పాత్రలు ఆయా నటీనటులకు జీవితకాలం గుర్తుండిపోయేలా రాసుకొని పర్ఫెక్ట్‌గా అమలు చేసే ఆయన.. తన లేటెస్ట్ మూవీ ''లో వినూత్న ప్రయోగం చేస్తున్నారట. ఈ మూవీలో అల్లు అర్జున్‌తో తెర పంచుకునేందుకు నందమూరి కాంపౌండ్ నుంచి ఓ హీరోని సెలక్ట్ చేశారని తెలుస్తోంది. నారా వారబ్బాయి, యంగ్ హీరో నారా రోహిత్‌ని పుష్ప సినిమాలో కీలక పాత్ర కోసం తీసుకున్నారనేది ఫిలిం నగర్‌లో తాజాగా వినిపిస్తున్న టాక్. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నారా రోహిత్ కోసం పవర్‌ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారట సుక్కు. ఈ మేరకు రోహిత్‌తో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని సమాచారం. , రోహిత్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అయ్యేలా కథలో మార్పులు చేస్తూ పక్కా ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఇకపోతే పుష్పలో కథను మలుపుతిప్పే విలన్ క్యారెక్టర్ కోసం జగపతిబాబును లైన్ లోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈయన పాత్ర కూడా సినిమాలో హైలైట్ కానుందని అంటున్నారు. త్వరలోనే జగపతిబాబు, నారా రోహిత్ పాత్రలపై చిత్రయూనిట్ నుంచి అధికారిక సమాచారం రానుందని తెలుస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ నటిస్తుండగా, పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. అల్లు అర్జున్ కెరీర్‌లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/323IpyA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...