రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత పవర్ స్టార్ తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌తో షూటింగ్‌లో అడుగుపెట్టిన ఆయన.. వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఓ మూవీ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం పవన్ సినిమా కథపై కసరత్తులు చేస్తున్న హరీష్ శంకర్.. ఈ సినిమాలో ఆయన్ను ఓ విలక్షణ పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. లెక్చరర్ రోల్‌లో చూపిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పాఠాలు చెబుతూ విద్యార్థులకు భవిష్యత్ గైడ్ చేసే మాస్టర్‌గా పవన్‌ని చూపించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట హరీష్. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై హరీశంకర్ రూపొందించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గతంలో పవన్ కళ్యాణ్- హరీశ్ శంకర్ కాంబోలో రూపొందిన 'గబ్బర్‌సింగ్' ఇండస్ట్రీ హిట్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. Also Read: మరోవైపు పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' మూవీ ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ మూవీలో లాయర్‌గా నటిస్తున్నారు పవన్. అయన సరసన సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు ఇప్పటికే కమిట్ అయ్యారు పవర్ స్టార్. సో.. చూస్తుంటే వచ్చే ఏడాది పవన్ హంగామాతో థియేటర్స్ హోరెత్తిపోవడం ఖాయమే అనిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GbFKul
v
No comments:
Post a Comment