రెండేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్లతో వరుస సినిమాలకు కమిటైన ఆయన రెమ్మ్యూనరేషన్ విషయంలో సరికొత్త స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ హీరోల్లో టాప్ రెమ్మ్యూనరేషన్ తీసుకునే ఆయన ఇకపై రెమ్మ్యూనరేషన్ బదులు సినిమాకు వచ్చిన లాభంలో వాటా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. మరోవైపు పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇదే కంఫర్ట్ అని నిర్మాతలు సైతం భావిస్తున్నారట. ఈ మేరకు , పవన్ కళ్యాణ్ నడుమ సీక్రెట్‌గా ఓ డీల్ కుదిరిందని టాక్. సాధారణంగానే పవన్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేది ఉంటుంది. స్టోరీ సంగతి పక్కనబెడితే కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్‌తోనే సినిమా గట్టెక్కుతుంది. ఒకవేళ హిట్ టాక్ రావాలే గానీ ఇక ఆ కలెక్షన్ల సునామీ ఊహించలేం. రికార్డులు తిరగరాస్తూ నిర్మాతలకు లాభాల పంట పండుతుంది. ఈ క్రమంలోనే పవన్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో చూస్తున్న ఫేమస్ నిర్మాత దిల్ రాజు.. ఆయనతో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారట. వీరిద్దరి కాంబోలో వస్తున్న '' సినిమాకు గాను రెమ్మ్యూనరేషన్ బదులు పవన్‌కి వాటా ఇవ్వబోతున్నారట దిల్ రాజు. Also Read: వకీల్ సాబ్ సినిమాలో 50శాతం షేర్స్ తీసుకోవడానికి దిల్ రాజుతో పవన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సినిమా బిజినెస్‌లో డైరెక్ట్‌గా షేర్ ఇవ్వడం అనే ఈ ఫార్ములా ఇద్దరికీ ఉపయోగకరమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంతా అనుకున్నట్లు జరిగి సినిమా హిట్ అయితే అటు నిర్మాతలకు, ఇటు పవన్ కళ్యాణ్‌కి కోట్ల రూపాయల వర్షం కురుస్తుందని అంటున్నారు. Also Read: వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. దీంతో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను లైన్‌లో పెట్టారు పవన్ కళ్యాణ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kP6S0O
v
No comments:
Post a Comment