Tuesday, 8 September 2020

Nithiin: వెంకీ కుడుముల బర్త్ డే.. డైరెక్టర్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ ఖరీదైన బహుమతి ఇచ్చిన నితిన్

తనకు సూపర్ డూపర్ హిట్ అందించి తిరిగి ట్రాక్ ఎక్కించిన డైరెక్టర్ వెంకీ కుడుములను హీరో సర్‌ప్రైజ్ చేస్తూ ఖరీదైన బహుమతి ఇచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతూ రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు నితిన్. ఈ బహుమతి స్వీకరించిన వెంకీ కుడుముల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ''ఉత్తమ వ్యక్తితో ఉత్తమైన సినిమాలు తీసినప్పుడు ఇలాంటి ఉత్తమైనవి జరుగుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ అన్నా'' అని పేర్కొంటూ ఆ కారుతో దిగిన పిక్ షేర్ చేశారు. Also Read: వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వచ్చిన 'భీష్మ' మూవీ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. నితిన్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచి రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్ల ప్రవాహం పారించింది. క్లాస్, మాస్ అన్ని సెంటర్లలో భారీ ఓపెనింగ్స్ రాబట్టి నితిన్ కెరీర్‌ని తిరిగి గాడిలో పెట్టేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నితిన్ జోడీగా రష్మిక మందన నటించింది. 2020 ఆరంభంలో వచ్చిన ఈ సక్సెస్ గుర్తు గానే నితిన్ తన దర్శకుడు వెంకీ కుడుములకు రేంజ్ రోవర్ కారు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే ఇటీవలే తన ప్రేయసి షాలినిని పెళ్లి చేసుకొని బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టిన నితిన్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' మూవీ చేస్తున్నారు నితిన్. 'రంగ్ దే' చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. 'గివ్ మీ స‌మ్ ల‌వ్‌' అనే ట్యాగ్‌లైన్‌తో మరోసారి యూత్ ఆడియన్స్‌ని పడేసేందుకు రెడీ అయ్యాడు ఈ కొత్త పెళ్లి కొడుకు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RabJ01
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...