Saturday, 19 September 2020

Modi: రూమ్‌‌కి పిలిచి అనురాగ్ కశ్యప్ వికృత చేష్టలు.. దుస్తులు విప్పి రచ్చరచ్చ! ప్రధాని వద్దకు పాయల్ ఇష్యూ

సినీ ఇండీస్ట్రీలో లైంగిక దోపిడీ జరుగుతోందంటూ ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఉద్యమాల ప్రభావంతో ఎందరో నటీమణులు తమపై జరిగిన లైంగిక దాడిని బయటపెడుతూ ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలోనే సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ పెద్దలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా డైరెక్టర్ పేరు బయటపెడుతూ సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ పాయల్ ఘోష్. గదికి తీసుకెళ్లి ఆయన చేసిన వికృత చేష్టలు బయటపెట్టిన ఆమె.. తాజాగా ఈ ఇష్యూను వద్దకు తీసుకెళ్లింది. తనను ఓ డైరెక్టర్ బాగా గారాబం చేసేవాడని, ఆ చనువుతో ఓ రోజు రూమ్‌కి పిలిచి బ్లూ ఫిల్మ్ చూపించాడంటూ సంచలన ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్.. నిన్న మీడియా ముందుకొచ్చి ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనురాగ్ కశ్యప్ అని ఓపెన్‌గా చెప్పేసింది. అంతేకాదు ఆయన రూమ్‌‌కి పిలిచి చేసిన వికృత చేష్టలు బయటపెట్టింది. రూమ్‌లోకి తీసుకెళ్లి తన దుస్తులు విప్పేసి దారుణంగా ప్రవర్తించాడని, ఆ సందర్భం వర్ణించలేనిదంటూ ఆవేదన చెందింది. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో కలకలం సృష్టించింది. Also Read: ఈ నేపథ్యంలో తాజాగా అనురాగ్‌ కశ్యప్‌ గురించి తెలుపుతూ భారత ప్రధాని నరేంద్రమోడీ సాయం కోరింది హీరోయిన్ పాయల్ ఘోష్. ఈ విషయంపై దృష్టి పెట్టి అనురాగ్‌ కశ్యప్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ ద్వారా ప్రధానిని వేడుకుంది. ''దయచేసి అతని ముసుగు వెనుక ఉన్న రాక్షసుడిని దేశానికి చూపించండి. ఇది నాకు హాని కలిగిస్తుందని, నా భద్రతకు ప్రమాదమని తెలుసు. దయచేసి అతనిపై వెంటనే చర్యలు తీసుకుని సాయం అందించండి'' అని పేర్కొంటూ ప్రధానికి ట్యాగ్ చేసింది పాయల్. స్త్రీ స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు చెప్పే అతడే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేశాడని, ఇండస్ట్రీలోని అమ్మాయిలు నాతో పడుకోవడానికి వెనుకాడరని కూడా అనురాగ్‌ కశ్యప్ తనకు చెప్పాడంటూ సంచలన విషయాలు బయటపెట్టింది పాయల్ ఘోష్. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35QAlU0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...