Friday, 18 September 2020

Madhumitha: ఈ టైమ్‌లో నీకు ప్రెగ్నెన్సీ ఏంటని అడిగారు! లైవ్‌లోనే ఎమోషనల్ అయిన శివ బాలాజీ భార్య

ఆన్‌లైన్ క్లాసుల పేరిట ప్రైవేట్ పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నారంటూ టాలీవుడ్ నటుడు శివబాలాజీ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని మణికొండలో ఉన్న మౌంట్‌ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై అయన మండిపడుతూ మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశారు. దీంతో హాట్ టాపిక్ అయిన ఈ ఇష్యూపై పలు మీడియా సంస్థలు చర్చావేదికలు పెట్టాయి. అయితే ఆ చర్చల్లో స్కూల్ యాజమాన్యం తీరుపై రియాక్ట్ అవుతూ లైవ్‌లోనే ఎమోషనల్ అయింది భార్య . ఈ లైవ్ ప్రోగ్రామ్స్‌లో పలు సంచలన విషయాలు వెల్లడించిన మధుమిత.. కేవలం తమ పిల్లల గురించి మాత్రమే తాము అడగడం లేదని, ఇలాంటి ఎన్నో విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నాయని ఆవేదన చెందింది. ఇక ఈ లైవ్ ప్రోగ్రాంలోనే సదరు మౌంట్‌ లిటేరా జీ స్కూల్‌లో పని చేసిన ఓ లేడీ టీచర్ స్పందిస్తూ.. తాను ఆ స్కూల్‌లో సంవత్సరం పాటు పనిచేశానని, తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే.. నీకెందుకు ఈ టైమ్‌లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని అడిగారని చెప్పింది. ఇది విని లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంటూ స్కూల్ యాజమాన్యంపై ఫైర్ అయింది మధుమిత. Also Read: మరోవైపు శివబాలాజీ ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సీ).. మౌంట్‌ లిటేరా జీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీనిపై సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రైవేట్ పాఠశాల వ్యవహారం, ఫీజుల ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RI8sVQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...