Sunday, 13 September 2020

Krishnam Raju: 'ఆదిపురుష్'లో కృష్ణం రాజు రోల్ ఇదే! ఇక రెబల్ స్టార్ అభిమానులకు పండగే పండగ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ మాంచి ఫామ్‌లో ఉన్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్ అయిన ఈ హీరో.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' మూవీ చేస్తూనే అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మరో సినిమా ''కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఎప్పుడైతే 'ఆదిపురుష్' మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారో అప్పటినుంచి జనాల్లో ఈ సినిమా రేంజ్ ఎలా ఉంటుందనే దానిపై చర్చలు మొదలయ్యాయి. నిత్యం 'ఆదిపురుష్'‌కి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్‌గా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ నటించనుందనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా, అంతకుమించి అన్నట్లు తాజాగా మరో విషయం బయటకొచ్చింది. 'ఆదిపురుష్'లో ప్రభాస్ పెదనాన్న కూడా నటించనున్నారని తెలుస్తుండటం ప్రభాస్ అభిమానులను హుషారెత్తిస్తోంది. లేటెస్ట్ సమాచారం మేరకు పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు పాత్ర సినిమాలో కీలకం కానుందని తెలుస్తోంది. Also Read: పౌరాణిక నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించనున్నారని తెలిసింది. అలాగే రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఇప్పుడు కృష్ణం రాజు పేరు కూడా బయటకు రావడంతో రెబల్ స్టార్ పండగ చేసుకుంటున్నారు. పౌరాణిక పాత్రల్లో నటించడం కృష్ణంరాజుకి కొట్టినపిండే కనుక మరోసారి వెండితెరపై ఆయన వేషం చూడాలనే ఆరాటం కనిపిస్తోంది జనాల్లో. Also Read: ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ 'ఆదిపురుష్' మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా భారీ ఎత్తున ఈ మూవీని రూపొందించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kaLKSz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...