Monday, 14 September 2020

Krack: స్టైలిష్ లుక్‌లో రవితేజ.. లేటెస్ట్ పిక్స్‌తో మాస్ మహారాజ్ స్పెషల్ కిక్

జయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ''. క్యాచీ టైటిల్, డిఫరెంట్ స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా పరిస్థితులు తలక్రిందులు కావడంతో బ్రేక్ పడిన ఈ మూవీ షూటింగ్.. తిరిగి త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొంటూ తాజాగా తన స్టైలిష్ లుక్‌ పోస్ట్ చేశారు రవితేజ. దాదాపు మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన మేకర్స్ కరోనా కారణంగా మిగిలిన కొద్దిభాగం షూటింగ్ వాయిదా వేశారు. నిజానికి అన్నీ సజావుగా జరిగితే ఈ సినిమా మే లోనే సినిమా విడుదలయ్యేది. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ మొదలు కాబోతున్నట్లుగా చెబుతూ హీరో రవితేజ కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. 'మిస్సింగ్ ద సెట్స్‌.. షూట్ స్టార్ట్స్ సూన్‌..' అని ట్యాగ్ చేస్తూ ఆయన పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రవితేజను చూసి మురిసిపోతూ మళ్ళీ మా 'ఇడియట్' రంగంలోకి దూకుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు. Also Read: గతంలో రవితేజ- గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన ''డాన్‌ శీను, బలుపు'' సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ హ్యాట్రిక్ మూవీ 'క్రాక్'పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై ఉన్న హైప్ రెట్టింపు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33sWMvE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...