Monday, 28 September 2020

Jaya Prada: బాలయ్య కోసం జయప్రదను రంగంలోకి దించాలని బోయపాటి ప్లాన్.. ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందంటే!!

నందమూరి నటసింహం బాలకృష్ణతో భారీ సినిమా రూపొందిస్తున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ సినిమా కోసం సీనియర్ హీరోయిన్‌ జయప్రదను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. బాలకృష్ణ- కాంబినేషన్‌లో హాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో కోసం ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారని సమాచారం. ఈ మేరకు ఆమెతో బోయపాటి టీమ్ సంప్రదింపుల కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది. ''సింహ, లెజెండ్'' లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో హాట్రిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ కొంతమేర షూటింగ్ జరుపుకొని లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ ఖాళీ సమయంలో కథను మరింత సానబడుతున్న బోయపాటి.. కొత్త ప్లాన్ రచించారని తెలుస్తోంది. ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్న నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్స్ కోసం వేట మొదలుపెట్టిన ఆయన ఓ హీరోయిన్‌గా జయప్రదను కన్ఫర్మ్ చేశారట. పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఉన్న కారణంగా జయప్రద కూడా వెంటనే ఓకే అందని విశ్వసనీయ వర్గాల సమాచారం. Also Read: ఇకపోతే ఈ మూవీలో బాలయ్య సరసన నటించనున్న మెయిన్ హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. శ్రీయ, నయనతార లాంటి టాప్ హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ.. వాళ్ళెవరూ కాదని, ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకోవాలని బోయపాటి నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో బాలయ్యతో జయప్రద కూడా జోడీ కట్టనుందని తెలుస్తుండటం నందమూరి అభిమానులను హుషారెత్తిస్తోంది. మరోవైపు కథలో భాగంగా వచ్చే ఓ కీలకమైన పాత్ర కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని రంగంలోకి దించనున్నారనే టాక్ రావడం సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఏదిఏమైనా ఈ సినిమాతో మరోసారి బాలయ్యతో బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాయించాలని బోయపాటి బలంగా ఫిక్సయినట్లు మాత్రం తెలుస్తోంది. చూడాలి మరి ఈ హాట్రిక్ కాంబో ఏ మేర ట్రీట్ ఇస్తుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36pVsgr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...