Wednesday, 23 September 2020

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డైరెక్టర్ కొడుకు.. రంగంలోకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ తన కుమారుడు సమీర్ వేగేశ్నను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో మేఘామ్ష్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా ‘కోతి కొమ్మచ్చి’ అనే టైటిల్‌తో సినిమా చేయబోతున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ.. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న మా చిత్రంలో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. సినిమాలో ఐదు పాటలు ఉంటాయి. యువతను ఆకట్టుకునేలా అనూప్ పాటలు సమకూరుస్తూ, కథకు తగ్గట్టుగా మంచి ఆల్బం ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం’’ అని తెలిపారు. నిర్మాత ఎం.ఎల్.వి. సత్యానారాయణ మాట్లాడుతూ.. ‘‘సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో ప్రారంభించి నవంబర్ నుండి షూట్ మొదలు పెడతాం’’ అని అన్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FYUD2M
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...