Saturday, 5 September 2020

షర్ట్ తీసేసి... స్పోర్ట్స్ బ్రాతో హీరోయిన్ కసరత్తులు.. పార్కులో రచ్చ రచ్చ

నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్‌లో.. అగర సరస్సు పక్కనున్న పార్కు అది. సాయంత్రం పూట ఎక్సర్‌సైజ్, వాకింగ్ చేయడానికి నగరవాసులు అక్కడికి వస్తుంటారు. కిర్రాక్ పార్టీ సినిమా హీరోయిన్ తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్కుకు వచ్చింది. తన ఒంటి మీద ఉన్న షర్ట్ తీసేసి.. స్పోర్ట్స్ బ్రాతో ఎక్సర్‌సైజ్ చేయడం మొదలు పెట్టింది. కానీ ఆమెకు దగ్గర్లోనే ఉన్న ఏఐసీసీ సభ్యురాలు కవితా రెడ్డి, మరి కొందరు ఆమెను అడ్డుకున్నారు. ఆ డ్రెస్ ఏంటంటూ దుర్భాషలాడారు. సంయుక్త ఈ వాగ్వాదాన్ని ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా రికార్డ్ చేసింది. కేవలం తను నటి అనే కారణంతో అక్కడ గుమికూడిన వారంతా.. తను డ్రగ్స్ తీసుకుంటానని విమర్శించారని వాపోయింది. వెంటనే కవితా రెడ్డి పోలీసులకు ఫోన్ చేశారు. బహిరంగ ప్రదేశంలో ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు సంయుక్త, ఆమె స్నేహితులపై కేసు నమోదు చేయాలని కవితా రెడ్డితోపాటు అక్కడున్న వారు మాట్లాడటం మరో వీడియోలో కనిపించింది. ఆ తర్వాత కవితా రెడ్డి, హీరోయిన్ సంయుక్తా హెగ్డే సోషల్ మీడియాలో వార్ కొనసాగించారు. కొందరు కవితా రెడ్డిని సమర్థించగా.. మరి కొందరు మాత్రం మరో వ్యక్తిపై దాడి చేసే హక్కు కవితారెడ్డికి ఎవరిచ్చారంటూ.. హీరోయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i3vqCi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...