Tuesday, 29 September 2020

‘ఆదిపురుష్’లో సీతగా అనుష్క.. రూమర్స్‌కు చెక్ పెట్టిన దేవసేన

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, ఓం రౌత్‌ దర్శకత్వంలో త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనున్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌'. ఈ సినిమాలో సీత పాత్రలో నటించే హీరోయిన్ గురించి కొద్దిరోజులుగా అనేక పుకార్లు వస్తూ ఉన్నాయి. కీర్తి సురేష్‌, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా, శర్మ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క పేరు ప్రముఖంగా వినిపించింది. బాహుబలి సినిమాలో అలరించిన ఈ జంట ‘’ మళ్లీ జతకట్టనుందన్న వార్తలో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. తన తాజా సినిమా ‘నిశ్శబ్దం’ అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుష్క ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్‌కు సంబంధించి వస్తున్న రూమర్‌పై ఆమె స్పందించారు. ‘''నాకు అలాంటి ఆఫర్‌ ఏమీ రాలేదు. నేను ఆదిపురుష్ చిత్రంలో నటించడం లేదు. ఆ వార్తల్లో నిజం లేదు.." అని అనుష్క తెలిపారు. దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు అనుష్క చెక్ పెట్టేసింది. Also Read: టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్లలో , అనుష్కది అగ్రస్థానం. వీరిద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్లో నటించగా.. అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈ జంటను వెండితెరపై మరోసారి చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ‘ఆదిపురుష్’‌లో రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33cGojU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...