Wednesday, 30 September 2020

‘నా తప్పు ఏమున్నదబ్బా’.. స్టెప్పులతో మతిపోగొట్టిన ఊర్వశి రౌటేలా

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ హీరోయిన్ తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ‘బ్లాక్ రోజ్’. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ సాంగ్‌ను యూనిట్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. `నా తప్పు ఏమున్నదబ్బా` అంటూ సాగే ఈ పాటలో ఊర్వశి దుమ్మురేపే డ్యాన్సులతో మతి పోగొడుతోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్ పతాకంపై తెరకెక్కుతున్న ‘బ్లాక్ రోజ్’ సినిమాలో ఊర్వశి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఏమైంది ఈవేళ, రచ్చ , బెంగాల్ టైగర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. షేక్‌ స్పియ‌ర్‌ రచించిన “ది మర్చంట్ ఆఫ్ వెనిస్`` లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jc8MbD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...