Wednesday, 23 September 2020

సుశాంత్‌ డ్రగ్స్ కోసం నన్ను వాడుకున్నాడు: రియా సంచలన ఆరోపణలు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో అరెస్టయిన బాలీవుడ్ హీరోయిన్ మరో బాంబు పేల్చారు. బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో సుశాంత్‌ గురించి నమ్మశక్యం కాని విషయాలు వెల్లడించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తరుచూ డ్రగ్స్‌ తీసుకునేవాడని, డ్రగ్స్ తీసుకురావాలంటూ సిబ్బందిని కోరేవాడని పేర్కొంది. సుశాంత్ జీవించి ఉంటే అతడిపై తక్కువ అభియోగాలు నమోదయ్యేవని, ఏడాది మాత్రమే జైలుశిక్ష విధించేవారని తెలిపింది. డ్రగ్స్ కోసం తనను, తన సోదరుడితో పాటు ఇతరులను సుశాంత్ వాడుకున్నాడని రియా ఆరోపించింది. Also Read: ‘సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం నాతో క్లోజ్‌గా ఉండేవాడు. నా సోదరుడిని, సిబ్బంది డ్రగ్స్ కోసం వేధించేవాడు. అతడు చేసిన దానికి ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తవున్నాం’ అని రియా విచారణలో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేశారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీ నిన్నటితో ముగియగా.. న్యాయస్థానం అక్టోబర్ 6 వరకు పొడిగించింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించింది. తాజా బెయిల్ పిటిషన్‌ విచారణను బాంబే హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/303paUa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...