Saturday, 19 September 2020

దేశంలో టాలీవుడే నెంబర్‌వన్: కంగనా షాకింగ్ కామెంట్స్

మన దేశానికి సంబంధించి హిందీ చిత్ర పరిశ్రమే పెద్దదిగా భావిస్తుంటారు. బడ్జెట్ పరంగా, కలెక్షన్ల పరంగా ఇతర భాషల ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడే ముందుంటుంది. కానీ అదంతా గతమని, ఇప్పుడు దేశంలో తెలుగు సినీ పరిశ్రమే() పెద్దదని అంటోంది క్వీన్ . వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ ఫైర్ బ్రాండ్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. Also Read: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై స్పందించిన కంగనా రనౌత్.. `దేశంలో నెంబర్ వన్ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలోకి వచ్చింది. తరుచూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ హిందీ చిత్ర పరిశ్రమకు సవాలు విసురుతోంది. Also Read: చాలా హిందీ సినిమాలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్‌ జరుపుకుంటాయి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు ఒక్కటై ‘ భారతీయ సినీ పరిశ్రమ’గా ఏర్పడాలి. మనదేశంలో ఒక్కో భాషకు ఒక్కో ఇండస్ట్రీ ఉండటం వల్ల హాలీవుడ్‌ లాభపడుతోంది’ అని కంగనా ట్వీట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ఓ వర్గం తీవ్రంగా మండిపడుతోంది. తాజాగా బాలీవుడ్‌ను తక్కువ చేస్తూ ఆమె చేసి ట్వీట్‌పై ఎవరెలా స్పందిస్తారో చూడాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZTsDER
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...