Monday, 14 September 2020

నాన్న కోలుకుంటున్నారు.. వారందరికీ ధన్యవాదాలు: ఎస్పీ చరణ్

బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఎస్పీ బాలు కుమారుడు చరణ్ తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నట్లు ఎక్స్‌రేలో కనిపిస్తోంది. ఫిజియోథెరపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. 20 నిమిషాల పాటు కూర్చోగలుతున్నారు. త్వరలోనే ద్రవ పదార్థాలు అందించవచ్చని డాక్టర్లు తెలిపారు’ అని ఎస్పీ చరణ్ తెలిపారు. Also Read: ఇప్పటివరకు తమ కుటుంబానికి తోడుగా నిలిచి అండగా ఉన్నవారందరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో తన తండ్రి పట్ల చూపించిన ప్రేమ అనురాగాలకు ధన్యవాదాలు చెప్పారు. ఎస్పీ బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చేవరకు ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించాలన్నారు. కరోనా వైరస్ సోకడంతో ఆగస్టు 5వ తేదీన బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే చికిత్స సమయంలో పరిస్థితి విషమంగా మారడంతో అభిమానులు కంగారుపడ్డారు. ఎట్టకేలకు ఇటీవలే ఆయనకు కరోనా నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2E3rpzg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...