Wednesday, 30 September 2020

కృష్ణా నదికి వరదలు.. కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాత ఇల్లు

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు ముంచెత్తడంతో నదీ పరివాహక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. దీంతో అనేక గ్రామాలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా సమీపంలోని ఎడ్లలంక గ్రామం కూడా ముంపులో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామంలో ఉన్న హీరో తాత, భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్ ఇల్లు కొట్టుకుపోయింది. Also Read: పాతకాలం నాటి ఇల్లు కావడంతో వరద నీటికి పునాదులు కదిలి ఇల్లు మొత్తం నదిలో కలిసిపోయింది. శర్వానంద్ అవనిగడ్డ వచ్చినప్పుడల్లా ఇదే ఇంట్లో ఉండేవారట. ఆయన్ని కలిసేందుకు చాలా మంది అభిమానులు ఆ ఇంటికి వచ్చేవారు. ప్రస్తుతం వరద నీటిలో శర్వానంద్ తాత ఇల్లు కొట్టుకుపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30noWaS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...