Tuesday, 8 September 2020

కంగనా రనౌత్ సినిమాను రిజెక్ట్ చేసిన పీసీ శ్రీరామ్.. స్టార్ హీరోయిన్ షాకింగ్ రిప్లై

పీసీ శ్రీరామ్.. సినీ ప్రియులకు ఈయన గురించి పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలోని ప్రతీ నటుడూ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీలో పనిచేయాలని కచ్చితంగా కోరుకుంటారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తారు. అయితే, పీసీ శ్రీరామ్ మంగళవారం ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రధాన పాత్ర పోషిస్తోన్న సినిమాను చేయడానికి తాను తిరష్కరించానని శ్రీరామ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న సినిమాకు పనిచేయడానికి నేను అంగీకరించలేదు. లోతుగా ఆలోచించాక నాకు ఇబ్బందిగా అనిపించింది. నా కారణాలను మేకర్స్‌కి వివరించారు. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు మన మనసుకి ఏది ఒప్పు అనిపిస్తే అదే చేయాలి. వాళ్లకు నా శుభాకాంక్షలు’’ అని పీసీ శ్రీరామ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. పీసీ శ్రీరామ్ ట్వీట్ చేసిన కొంత సేపటికి కంగనా రనౌత్ స్పందించారు. పీసీ ట్వీట్‌కు చాలా కూల్‌గా రిప్లై ఇచ్చారు. పీసీ శ్రీరామ్ లాంటి దిగ్గజ సినిమాటోగ్రాఫర్‌తో పనిచేసే తాను కోల్పోయానని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘మీలాంటి దిగ్గజంతో పనిచేసే అవకాశాన్ని నేను కోల్పోయాను సార్. ఇది నాకు పెద్ద లోటు. నా వల్ల మీకు ఏ విధంగా ఇబ్బంది కలిగిందో నాకు తెలీదు. కానీ, మీరు తీసుకున్న సరైన నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. మీకు అంతా మంచే జరగాలి’’ అని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, వివాదాలకు మారుపేరుగా మారిన కంగనా రనౌత్ ఇంత సాఫ్ట్‌గా శ్రీరామ్‌కు రిప్లై ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. కాగా, కంగన రనౌత్‌తో గతంలో పీసీ శ్రీరామ్ పనిచేశారు. 2008లో వచ్చిన కంగన తొలి తమిళ చిత్రం ‘ధామ్ ధూమ్’కు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. దివంగత దర్శకుడు జీవా ఆఖరి చిత్రమిది. ఇదిలా ఉంటే, దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఎన్నో గొప్ప చిత్రాలకు పీసీ శ్రీరామ్ పనిచేశారు. తెలుగులో ‘గీతాంజలి’ ఆయన తొలి చిత్రం. ఆ తరవాత ‘శుభసంకల్పం’, ‘ఖుషి’, ‘ఇష్క్’ చిత్రాలకు పనిచేశారు. తెలుగులో ఆయన చేసిన ఆఖరి చిత్రం ‘నా నువ్వే’. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/327L2zf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...