Monday, 7 September 2020

అర్జున్ కపూర్ గర్ల్‌ఫ్రెండ్ మలైకాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సినిమా సెలబ్రిటీల్లోనూ కొవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు అర్జున్ కపూర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, ఆయన ప్రేయసి మలైకా అరోరాకు కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మలైకా అరోరా చెల్లెలు అమృత అరోరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. అంతకు ముందు అర్జున్ కపూర్ తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘నాకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం మీ అందరికీ చెప్పడం నా బాధ్యత. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నేను బాగానే ఉన్నాను. డాక్టర్లు, అధికారుల సూచన మేరకు నేను నా ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. హోం క్వాంటైన్‌లోనే ఉంటాను. మీ ప్రోత్సాహానికి ముందుగానే కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో నా ఆరోగ్యం గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. గతంలో ఎప్పుడూ చూడని కఠిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మానవాళి ఈ వైరస్‌ను అధిగమిస్తుందని నాకు నమ్మకం ఉంది. ప్రేమతో, మీ అర్జున్’’ అని అర్జున్ కపూర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, అర్జున్ కపూర్ - మలైకా అరోరా తమ ప్రేమ విషయాన్ని కిందటేడాది అధికారికంగా ప్రకటించారు. నిజానికి మలైకా అరోరాకు గతంలో పెళ్లయింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ ఉన్నాడు. అర్బాజ్ ఖాన్ నుంచి 2017లో మలైకా విడిపోయారు. అయితే, అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోవడానికి ముందే అర్జున్ కపూర్‌తో మలైకా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వదంతులు ఉన్నాయి. మరోవైపు అర్జున్ కపూర్ కూడా గతంలో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆమె నుంచి విడిపోయిన తరవాతే సల్మాన్ ఖాన్ మరదలితో అర్జున్ కపూర్ కథ నడిపినట్టు ప్రచారంలో ఉంది. కాగా, అర్జున్ కపూర్ - మలైకా అరోరా మధ్య సుమారు 18 సంవత్సరాల వయసు తేడా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/331ELEw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...