Thursday, 10 September 2020

చిరంజీవి గుండు వెనుక సీక్రెట్ ఇదే.. దానికోసమే ఇదంతా! మెగాస్టార్ ప్లాన్ అదిరింది!!

రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ మరింత ఫామ్‌లో కనిపిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ మరింత డిఫరెంట్‌గా స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు. ఇటీవలే ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాతో తన చిరకాల కోరిక తీర్చుకున్న చిరంజీవి.. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ డిఫరెంట్ లుక్స్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న (గురువారం) గుండుతో దర్శనమిచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే వెనుక సీక్రెట్ ఏంటి? ఉన్నట్టుండి సడెన్‌గా ఇలా ఎందుకు మారారనే విషయమై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ గుండు సీక్రెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఆయన తన తదుపరి మూవీ టెస్ట్ లుక్ కోసం ఇలా రెడీ అయ్యారని తెలుస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ రాబోతుందని టాక్. Also Read: వేదాళం సినిమాలో హీరో అజిత్ గుండుతోనే కనిపిస్తాడు. కొద్దిపాటి వెంట్రుకలతో డిఫరెంట్ లుక్‌లో అదరగొట్టేస్తాడు. ఇప్పుడు ఈ రోల్ టెస్ట్ లుక్ కోసమే చిరు ఇలా గుండుతో కనిపించారని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ చేస్తున్న చిరంజీవి.. కరోనా కారణంగా వచ్చిన ఈ గ్యాప్‌లో ఈ టెస్ట్ లుక్ ప్రయత్నం చేద్దామని గుండు కొట్టించినట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతేమో గానీ మెగాస్టార్ మాత్రం గుండుతో తన అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చారనే చెప్పుకోవాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bLvFje
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...