Tuesday, 15 September 2020

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు: స్టార్ జంటకు పోలీసులిచ్చిన పోలీసులు

బాలీవుడ్‌, శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ కావడంతో దక్షిణ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. కస్టడీలో వీరిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. వారిద్దరు ప్రముఖుల పేర్లను వెల్లడించడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది. Also Read: ఈ క్రమంలోనే కన్నడ స్టార్ జంట దింగత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణ కోసం బుధవారం ఉదయం 11 గంటలకు సీసీబీ ఆఫీసులో తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలో నిర్వహిస్తున్న ఐ బార్టనే అనే క్యాసినోలో ఈ జంట సందడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో డ్రగ్స్ సరఫరా చేసేవారితో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. Also Read: డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపైన కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్టులో మంగళవారం సీసీబీ పోలీసులు తనిఖీలు చేశారు. ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2E2eJsg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...