Tuesday, 22 September 2020

పెళ్లి మ్యాటర్ బయటపెట్టిన శ్రీముఖి.. అందరి ముందే అతనికి లవ్ ప్రపోజల్! రాములమ్మ సడెన్ షాక్

వెండితెర స్టార్ హీరోయిన్లకు సైతం పోటీగా మారారు బుల్లితెర యాంకర్లు. హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ తెచ్చుకొని తెగ హంగామా చేస్తున్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్‌తో బుల్లితెరను దున్నేస్తూనే వెండితెరపై కూడా అవకాశాలు పట్టేస్తున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు యాంకర్స్ , రష్మీ, అనసూయ. అయితే ఈ ముగ్గురిలో అనసూయ మినహాయిస్తే మిగితా ఇద్దరు భామలు మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే ఉండటంతో వాళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన పెళ్లి మ్యాటర్ స్వయంగా చెప్పేస్తూ ఓపెన్ అయింది శ్రీముఖి. Also Read: గత సీజన్ బిగ్ బాస్‌లో రచ్చరచ్చ చేసి రన్నరప్ కొట్టేసిన శ్రీముఖి.. ప్రస్తుతం పలు టీవీ షోస్ చేస్తూ యమ జోష్‌‌లో ఉంది. ఈ క్రమంలోనే సుమ హోస్ట్‌గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంకి గెస్టుగా వచ్చిన ఈ 27 ఏళ్ల సుందరి.. పెళ్లిపై తన మనసులో మాట బయటపెట్టి షాకిచ్చింది. అదే ప్రోగ్రాంకి వచ్చిన డాన్సర్ పండును వివాహం చేసుకుంటా అని అందరిముందే ఓపెన్‌గా చెప్పేయడంతో సుమ సహా మిగిలిన పార్టిసిపెంట్స్ గెటప్ శ్రీను, విష్ణు ప్రియ నోరెళ్లబెట్టారు. ఇక పండు అయితే ఊహల్లో తేలిపోతూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అంతటితో ఆగని శ్రీముఖి.. మరో రెండేళ్లలో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ వదిలేస్తానని, భర్తతో హాయిగా గడుపుతానని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే సెప్టెంబర్ 26వ తేదీన ప్రసారం కాబోతున్న ఈ క్యాష్ ప్రోగ్రాంలో మ్యాటర్ హైలైట్ కానుందని తెలుస్తోంది. Also Read: బుల్లితెర, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న శ్రీముఖి ఆన్‌లైన్ వేదికలను సైతం షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఆమె చేస్తున్న ఆన్‌లైన్ ప్రోగ్రాం 'ఓ ఉమానియా' ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుంది. మరోవైపు 'ఇట్స్ టైమ్ టు పార్టీ' అనే సినిమాలో నటిస్తోంది శ్రీముఖి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iSfxiN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...