Tuesday, 8 September 2020

అశ్రునయనాలతో జయ ప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి.. కరోనా కారణంగా దూరంగానే ఆయన తనయుడు!

ప్రముఖ సినీ నటుడు, రంగస్థల కళాకారుడు పూర్తయ్యాయి. ఈ రోజు (మంగళవారం) తెల్లవారు జామున గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందగా సాయంత్రానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే చివరి యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు చెప్పారు. గుంటూరులోని స్థానిక స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కాగా గత కొన్ని రోజులుగా జయ ప్రకాష్ రెడ్డి తనయుడు కరోనాతో బాధపడుతున్న కారణంగా అంత్యక్రియలకు దూరంగా ఉన్నాడు. తండ్రి చితిని దూరం నుంచి చూస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించాడు. సినీ పరిశ్రమ నుంచి రచ్చ రవి, గిరి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలిసింది. జయ ప్రకాష్ రెడ్డి అకాల మరణంతో టాలీవుడ్ చిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజమౌళి, అనిల్ రావిపూడి తదితర సినీ ప్రముఖులు తమ తమ విచారం వ్యక్తం చేశారు. Also Read: మంగళవారం ఉదయం 7 గంటలకు గుంటూరులోని తన స్వగృహంలో జయ ప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. బాత్రూమ్‌లో గుండెపోటుతో కుప్పకూలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తిగా ఉన్న జయ ప్రకాష్ రెడ్డి 1988లో విడుదలైన ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనదైన రాయలసీమ మాండలికంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R2PdWM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...