బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెపోటిజం మొదలుకొని బాలీవుడ్ సెలబ్రిటీల చీకటి కోణాలు, డ్రగ్స్ దందా తదితర అంశాలపై రెచ్చిపోతున్న ఆమె ఇటీవలే ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇష్యూ పలు వివాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో కంగనా బహిరంగ సవాల్ చేస్తూ ట్వీట్స్ చేయడం మరో సెన్సషనల్ ఇష్యూ అయింది. ముంబై పోలీసులపై కంగన విమర్శలను తప్పుపడుతూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఓ పత్రికలో సంపాదకీయం రాశారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగు పెట్టవద్దని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కంగన తీవ్ర స్థాయిలో మండిపడింది. మరోవైపు తనకు వ్యతిరేఖంగా వస్తున్న నినాదాలు, దిష్టి బొమ్మల దహనంపై మండిపడుతూ సంచలన కామెంట్స్ చేసింది. Also Read: ఈ నేపథ్యంలో కంగన తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అటు శివసేన సహా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా కంగన తీరును విమర్శించాయి. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ముంబైలో అడుగు పెట్టొద్దని ఆమెను హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలపై తాజాగా కంగన స్పందిస్తూ బహిరంగ సవాల్ విసిరింది. ''సెప్టెంబర్ నెల 9వ తేదీన ముంబై వస్తున్నా. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే టైమ్‌ను పోస్ట్ చేస్తా. దమ్ముంటే రండి.. వచ్చి నన్ను ఆపండి'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది కంగనా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2F1FJZl
v
No comments:
Post a Comment