హాట్ మోడల్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లయిన కొద్దిరోజులకే భర్తపై వేధింపులకు కేసు పెట్టి అరెస్ట్ చేయించిన ఈ హాట్ బాంబ్ మళ్లీ యూటర్న్ తీసుకుంది. భర్త సామ్ బాంబేపై పెట్టిన కేసు వాపసు తీసుకోవాలని నిర్ణయించినట్లు తాజాగా వెల్లడించింది. భర్త తన ముందు కూర్చుని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడని, జీవితంలో మళ్లీ కొట్టనని హామీ ఇచ్చాడని పూనమ్ తెలిపింది. అతడి పరిస్థితి చూస్తే జాలేస్తోందని, అందుకే కేసు వాపసు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పూనమ్ వెల్లడించింది. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడు సామ్ బాంబేను పూనమ్ పాండే ఈ నెల ఒకటో తేదీన పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ షూటింగ్ నిమిత్తం భర్తతో కలిసి గోవా వెళ్లింది. అక్కడ తనను తీవ్రంగా కొట్టాడంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా.. మరుసటి రోజు బెయిల్‌పై బయటికి వచ్చాడు. ప్రతిసారి శామ్ బాంబే తనను కొట్టి మరోసారి ఇలా చేయనంటూ ఏడవడం మొదలు పెడతాడని పూనమ్ తెలిపింది. తన లైఫ్ కొంతకాలంగా ఇలాగే ఉంటోందని చెప్పుకొచ్చిన ఆమె.. మళ్లీ మనసు మార్చుకుని భర్తను క్షమించేసింది. Also Read: వైవాహిక జీవితంలో ఎత్తు పల్లాలు కామన్ అని, భర్తతో కలిసిపోయి వివాహ జీవితాన్ని హ్యాపీగా కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు శనివారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నామని, మళ్లీ కలిసి జీవించబోతున్నాం’ అంటూ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ‘ మేమిద్దరం ఘాడంగా ప్రేమించుకుంటున్నాం. బలమైన ప్రేమలో ఉన్నాం. దాంపత్య జీవితంలోని హెచ్చుతగ్గులు మమ్మల్ని ఆపలేవు” అని పూనమ్ పేర్కొంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36dPM96
v
No comments:
Post a Comment