Wednesday, 30 September 2020

వితికా షెరు కొత్త ఇన్నింగ్స్: కల నెరవేరింది.. సుమ, అనసూయల పోటీ తట్టుకోగలదా!!

హీరో వరుణ్ సందేశ్ తన భార్య వితికా షెరుతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. వరుణ్ సందేశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయినా వితిక పెద్దగా ఎవరికీ తెలీదు. ఆమె కూడా హీరోయిన్‌గా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ, బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న తరవాత వితికాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత ఇంటర్వ్యూలతో బిజీ అయిపోవడమే కాకుండా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సుమారు ఏడాదిన్నర తరవాత ఇప్పుడు వితికా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన యాంకర్‌గా. యాంకరింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, యాంకర్ కావడం తన గోల్ అని గత ఇంటర్వ్యూలలో వితిక చెప్పారు. ఇప్పుడు ఆ కలను ఆమె నెరవేర్చుకున్నారు. ఈటీవీలో ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్న ‘సామజవరగమన’ షోకి వితిక యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఆదివారం (అక్టోబర్ 4) నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం యాంకర్ సుమ, అనసూయ బుల్లితెరను ఏలుతున్నారు. శ్రీముఖి, రష్మి కూడా సత్తా చాటుతున్నారు. వీళ్ల మధ్య పోటీని తట్టుకోగలరా లేదా చూడాలి. వీళ్ల కన్నా కొత్తగా ఉంటేనే వితికను ప్రేక్షకులు ఆదరిస్తారు. వితిక అందానికి ఆమె వాక్‌చాతుర్యం జత అయితే ఒక మంచి యాంకర్‌గా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు. కాగా, వితిక అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లమా చేశారు. 11 ఏళ్ల వయసులో టీవీ సీరియళ్లలో బాలనటిగా నటించిన వితికా.. 15 ఏళ్లకు హీరోయిన్ అయ్యారు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా తెరంగేట్రం చేశారు. తెలుగులో ఆరు సినిమాలు చేశారు. వీటిలో ‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలు చెప్పుకోదగినవి. వరుణ్ సందేశ్‌తో కలిసి ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంలో వితిక నటించారు. ఆ సినిమా సమయంలోనే వరుణ్‌తో ప్రేమలో పడ్డారు. 2015లో వరుణ్ సందేశ్‌ను వితిక వివాహం చేసుకున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l0mjn7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...