Friday, 4 September 2020

నీలాంటోడే నెపోటిజం, తొక్క అంటాడు.. కామెంట్ చేసిన వ్యక్తికి హీరో నందు స్ట్రాంగ్ కౌంటర్

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100% లవ్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నందు.. ఆ తరవాత సోలో హీరోగా మారారు. ఓ వైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అయితే, ఇంకా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సంపాదించుకోలేకపోయారు. ఈ ఏడాది ‘సవారి’ సినిమాతో డిఫరెంట్‌గా ట్రై చేసినా ఫలితం దక్కలేదు. అందుకే ఈసారి ఎలా అయినా హిట్టు కొట్టాలని ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ సినిమాతో వస్తున్నారు. అంతేకాదు, తన పేరును కూడా విజయ్ కృష్ణ అని మార్చుకున్నారు. ఈ సినిమాలో పోతురాజుగా ఆయన నటిస్తున్నారు. నందు పుట్టినరోజు సందర్భంగా నిన్న (సెప్టెంబర్ 3న) పోతురాజు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పౌరాణిక నాటకాల్లో పాత్రధారుడిలా కాస్ట్యూమ్, ఆభరణాలతో నందు కనిపించారు. అంతేకాదు, నోటిలో సిగరెట్ పెట్టుకుని స్టైలిష్‌గానూ ఉన్నారు. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. అయితే, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్టు ముందురోజు ఇన్‌స్టాగ్రామ్‌లో నందు అప్‌డేట్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ను విమర్శిస్తూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. వీటిలో ఒక కామెంట్ నందుకి ఆగ్రహం తెప్పించింది. దీంతో తనదైన శైలిలో అతగాడికి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చారు నందు. Also Read: ‘‘డైరెక్ట్‌గా రిలీజ్ చేయి బ్రో.. చూసి చస్తాం.. ఏదో పెద్ద సూపర్ స్టార్‌లా అప్‌డేట్ పోస్ట్స్ ఎందుకు టైమ్ బొక్క’’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. దీనికి నందు రిప్లై ఇచ్చారు. ‘‘మళ్లీ నీలాంటోడే వచ్చి నెపోటిజం, తొక్క, బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లను సపోర్ట్ చేద్దాం అని సుడో పోస్టులు పెడుతుంటాడు. సూసైడ్ చేసుకుంటే తప్ప బ్యాక్‌గ్రౌండ్ లేనోడికి సపోర్ట్ చేయని మీలాంటి సుడో బ్యాచ్‌కి ఒక నమస్కారం. అయినా ఏ స్టార్ అనీ నేను చెప్పుకోలేదు. నువ్వే ఇండైరెక్ట్‌గా తగిలిస్తున్నావు..’’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అంతేకాదు, ఈ రిప్లై స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్ కూడా చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jMpT3K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...