Wednesday, 30 September 2020

బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో షాకింగ్ ట్విస్ట్... తెరపైకి ముగ్గురు స్టార్ హీరోలు

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ ఇప్పటికే అరెస్ట్ కాగా.. దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితురులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నలుగురు హీరోయిన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. టెక్నాలజీ సాయంతో వీరి మొబైల్ డేటాను పునరుద్ధరించిన ఎన్సీబీ అధికారులకు షాకిచ్చే సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా డ్రగ్స్ వ్యవహారంలో ముగ్గురు స్టార్ హీరోలు భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో బడా హీరోలుగా చెలామణి అవుతున్న వారు డ్రగ్స్‌ ఉపయోగిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించినట్లు ఎన్సీబీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే వారికి కూడా నోటీసులు పంపించి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరోలు నోరు విప్పితే డ్రగ్స్ గుట్టు మొత్తం బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వారి ఫోన్లపై ఎన్‌సీబీ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GbTBkr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...