ప్రముఖ సినీ, రంగస్థల నటుడు మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జయప్రకాష్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. ‘‘జయప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి’’ అని ప్రధాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జయప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం 7 గంటలకు గుంటూరులోని స్వగృహంలో మృతిచెందారు. బాత్రూమ్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కరోనా కారణంగా సిసిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో గత కొద్ది నెలలుగా ఆయన గుంటూలో ఉంటున్నారు. జయప్రకాష్ రెడ్డి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిని టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. చాలా మంది నటీనటులు కంటతడి పెట్టుకున్నారు. టాలీవుడ్ ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జయప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివారు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట ఉన్నత పాఠశాలలో చేరారు. పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరారు జయప్రకాష్ రెడ్డి. Also Read: చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆయనకు ఆసక్తి. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. జయప్రకాష్ రెడ్డికి దాసరి నారాయణరావు తొలుత అవకాశం ఇచ్చారు. 1988లో విడుదలైన ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు జయప్రకాష్ రెడ్డి. ఇక, 1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం విలన్‌గా జయప్రకాష్ రెడ్డికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లాంటి విజయవంతమైన సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. కేవలం విలన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 300కు పైగా చిత్రాల్లో నటించారు. ‘జయం మనదేరా’ సినిమాకు జయప్రకాష్ రెడ్డి ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jTyYYs
v
No comments:
Post a Comment