Saturday, 12 September 2020

ఒక్క సినిమాతో రాణి లక్ష్మీబాయి అయిపోవు.. కంగనపై ప్రకాష్ రాజ్ సెటైర్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముంబై మరో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)గా మారిందన్న కంగనా ఆరోపణలపై శివసేన ప్రభుత్వం కంగనా ఆఫీసులోని కొన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధమంటూ కూలగొట్టింది. అంతేకాదు, కంగనాకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని కంగన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కంగన డ్రగ్స్‌ వాడేవారన్న ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. ఈ కేసును ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి తాను భయపడబోనని.. డ్రగ్స్ ఆరోపణల్లో ఎలాంటి విచారణకు అయినా తాను సిద్ధమని ఇప్పటికే కంగనా ప్రకటించారు. ఇదిలా ఉంటే, కంగనా రనౌత్ ప్రవర్తిస్తోన్న తీరుపై ప్రముఖ నటుడు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆమెపై సెటైరికల్‌గా ట్వీట్లు చేస్తున్నారు. కంగనా రనౌత్ ఛండీగఢ్ నుంచి ముంబై వచ్చినప్పుడు ఎంత హడావుడి జరిగిందో అందరికీ తెలిసిందే. ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడం, ఆమె విమానంలోకి జర్నలిస్టులు గుంపుగా వెళ్లి ఆమెను స్పందించమని అడగడం.. ఈ సంఘటనలు ఇప్పటికే వివాదాస్పదంగా మారాయి. Also Read: వీటిపై ఇప్పుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో దిక్కుతోచక రోడ్లపై నడుస్తూ సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీల ఫొటోలను ఒక పక్క.. కంగనాకు భద్రత కల్పిస్తూ చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని చూపిస్తూ ఉన్న ఫొటోను మరోపక్క ఉంచి.. ‘అవును.. ఇదే కొత్త భారతదేశం’ అంటూ కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్. మరో ట్వీట్‌లో దీనికి మించి సెటైర్ వేశారు. కంగనా రనౌత్ రాణి లక్ష్మీబాయిలా ఫీలవుతోందని పరోక్షంగా విమర్శించారు. ‘‘ఒక్క సినిమా తానను రాణి లక్ష్మీభాయిని చేసిందని కంగన అనుకుంటే.. దీపిక పద్మావతి, హృతిక్ అక్బర్, షారుఖ్ అశోకుడు, అజయ్ భగత్‌సింగ్, ఆమిర్ మంగల్ పాండే, వివేక్ మోదీ గారు అవుతారు’’ అని చెప్పే ఒక ఫొటోషాప్ చేసిన ఇమేజ్‌ను ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అంతేకాదు దానికి #justasking అని తన స్టైల్లో హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కంగనపై డ్రగ్స్ కేసు పెట్టిన శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇప్పటికే టార్గెట్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీష్ విమర్శకులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ఈ విమర్శలు బీజేపీకి వ్యతిరేకంగానేనని విమర్శలు వస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zw5WGE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...