Saturday, 26 September 2020

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుష్క?... వీక్షకులకు కనుల పండగే

కరోనా కారణంగా థియేటర్ల మూతపడటంతో చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల అవుతున్నాయి. ఈ కాలంలో చాలా చిన్నచిన్న సినిమాలతో పాటు నాని, సుధీర్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ‘వి’ కూడా ఓటీటీ ద్వారా విడుదలైంది. తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మూగ పెయింటర్‌‌‌గా విభిన్న పాత్రలో అనుష్క నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. Also Read: ఈ నేప‌థ్యంలో ఓ వార్త అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ‘నిశ్శబ్ధం’ యూనిట్ బిగ్‌బాస్-4 హౌస్‌లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై టాలీవుడ్ సర్కిళ్లలో ప్రచారం ఊపందుకోగా.. అటు బిగ్‌బాస్‌ నిర్వాహకులు గానీ, ఇటు నిశ్శబ్ధం యూనిట్ గానీ ఎలాంటి లీకులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆదివారం హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా అనుష్క బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలుసుకున్నవారు చాలాకాలం తర్వాత నాగార్జున, అనుష్యను ఒకే ఫ్రేమ్‌లో చూడబోతున్నామంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆదివారం నాటి షోలో నాగార్జున పాల్గొనరని, అనుష్క హోస్ట్‌గా సందడి చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇదే జరిగితే బిగ్‌బాస్ చరిత్రలో సెకండ్ ఫిమేల్ హోస్ట్‌గా అనుష్క నిలిపోతుందని చెబుతున్నారు. గతేడాది నాగ్ పుట్టినరోజు వేడుకల నిమిత్త విదేశాలకు వెళ్లిన సమయంలో ఓ వీకెండ్‌లో ర‌మ్యకృష్ణ వ్యాఖ్యాతగా రక్తి కట్టించారు. తాజా రూమర్లతో ఈ ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌ సందడిగా మారనుందని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i5tUit
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...