Thursday, 3 September 2020

నలుగురు హీరోల పేర్లు బయటపెట్టిన కంగనా.. కొకైన్ బానిసలపై పంజా! డ్రగ్స్ ఇష్యూలో కొత్త కోణం

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే గాక పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపోటిజం రాజ్యమేలుతోందని, అలాగే కొందరు బడా హీరోల బాగోతాలు బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందంటూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ ఇష్యూపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఏకంగా నలుగురు హీరో పేర్లు బయటకు తీసింది కంగనా. Also Read: సుశాంత్ సూసైడ్ కేసు విచారణలో భాగంగా ఆయన ప్రేయసి రియా చక్రవర్తికి డ్రగ్స్ డీలర్లతో సంబంధాలున్నాయని తెలియడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కొనసాగితే బాలీవుడ్ హీరోలంతా అడ్డంగా బుక్కవుతారని, అగ్ర నటులందరి రక్త నమూనాలు తీసుకుంటే ఎన్నో రహస్యాలు బయట పడతాయంటూ సంచలన కామెంట్స్ చేసిన కంగన.. తాజాగా కొందరు స్టార్ హీరోల పేర్లు ప్రస్తావిస్తూ వరుస ట్వీట్స్‌తో పంజా విసిరింది. రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మొత్తానికి తెలుసని, కొకైన్ బానిసలు అని ముద్రపడిన ఆ నలుగురూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని కోరింది కంగనా. డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిపై ఉన్న రూమర్లకు చెక్ పెట్టాలని తాను కోరుతున్నానని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ని ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేయడం మరింత సెన్సేషన్‌గా మారింది. సో.. చూడాలి మరి కంగనా కామెంట్స్‌పై ఆ నలుగురు హీరోలు ఎలా స్పందిస్తారనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32V8ZsD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...