Monday, 28 September 2020

హీరో సూర్య ఆఫీసుకు బాంబు బెదిరింపు.. చెన్నైలో కలకలం

తమిళ‌ హీరోలను బాంబు బెదిరింపులు కలవరపరుస్తున్నాయి. ఇటీవల కాలంలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, అజిత్‌, మ‌ణిర‌త్నం, విజ‌య్ త‌దిత‌రుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ పోలీసుల‌కు ఫోన్స్ వ‌చ్చాయి. దీంతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ కాల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్యను కేటుగాళ్లు టార్గెట్ చేశారు. చెన్నై అల్వార్‌పేట ప్రాంతంలో ఉన్న ఆఫీసులో బాంబు పెట్టినట్లు సోమవారం పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే డాగ్‌స్వ్కాడ్‌ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అది ఫేక్‌ కాల్ అని నిర్ధారించుకున్నారు. అయితే ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S2PQjI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...