Friday, 4 September 2020

బోయపాటి శ్రీను ఖాతాలో అరుదైన రికార్డ్.. బెల్లంకొండ స్టామినా..!!

ప్రముఖ దర్శకుడు స్టామినా గురించి అందరికీ తెలిసిందే. ఆయనలా మాస్ మసాలా సినిమాలు ఎవ్వరూ తీయలేరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి హీరోనైనా పవర్‌ఫుల్‌గా మార్చేస్తారు బోయపాటి. రవితేజతో ‘భద్ర’ సినిమా చేసి తొలి ప్రయత్నంతోనే ఘన విజయం సాధించారు. ఆ తరవాత వెంకటేష్‌తో ‘తులసి’ లాంటి పవర్‌ఫుల్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా చేశారు. ఇక బాలకృష్ణతో చేసిన ‘సింహా’ మూవీ బోయపాటి ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. బాలయ్యతో రెండో ప్రయత్నంగా ‘లెజెండ్’ తీసి మళ్లీ హిట్టు కొట్టారు. అయితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ‘సరైనోడు’గా ఇది వరకు చూడని మాస్ లుక్‌లో చూపించారు. గణ పాత్ర తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు. మరోదైపు, కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ను సైతం ‘జయ జానకి నాయక’ సినిమాతో పవర్‌ఫుల్‌గా చూపించి తన మార్క్‌ను చాటుకున్నారు. కిందటేడాది ‘వినయ విధేయ రామ’తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఇప్పుడు బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి జతకట్టి మరో బ్లాక్‌ బస్టర్‌పై కన్నేశారు. Also Read: బోయపాటి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు హిందీలోనూ ఫ్యాన్స్ ఉన్నారని ఇప్పుడు స్పష్టమైంది. ఆయన రెండు సూపర్ హిట్ మూవీస్ ‘సరైనోడు’, ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వర్షన్లు యూట్యూబ్‌లో ఒక్కోటి 30 కోట్ల (300 మిలియన్) వ్యూస్ సాధించాయి. ఒకే దర్శకుడు రూపొందించిన రెండు సినిమాలు యూట్యూబ్‌లో 300 మిలియన్ వ్యూస్ సాధించడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈ మార్క్ అందుకున్న ఇండియన్ మూవీస్ కూడా ఇవే. నిజానికి అల్లు అర్జున్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్‌లకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ‘సరైనోడు’ సినిమా ఇప్పటికే 300 మిలియన్ వ్యూస్ సాధించగా.. తాజాగా ‘జయ జానకి నాయక’ ఈ మార్క్‌ను అందుకుంది. Also Read: ‘రాక్షసుడు’ సినిమా విజ‌యంతో కెరీర్‌లో ముందుకు వెళ్తోన్న బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ప్రస్తుతం సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్షన్‌లో ‘అల్లుడు అదుర్స్’ చిత్రం చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన ‘క‌వ‌చం’ చిత్రం హిందీ వెర్షన్‌ ‘ఇన్‌స్పెక్టర్ విజ‌య్’ యూట్యూబ్‌లో 206 మిలియ‌న్ వ్యూస్ దాట‌గా, ‘అల్లుడు శ్రీ‌ను’ హిందీ డ‌బ్బింగ్ వెర్షన్ ‘మ‌హాబ‌లి’ 103 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GmPmlI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...