Thursday, 17 September 2020

Bigg Boss4: ప్రతి ముగ్గురిలో ఇద్దరి కన్ను ఇక్కడే పడింది.. చరిత్ర తిరగరాస్తున్నాం.. గర్వంగా నాగార్జున

అసలు ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందో ఉండదో అనుకున్న జనాలను ఆశ్చర్యపరుస్తూ ఓ టీంని రంగంలోకి దించారు . అన్నీ కొత్త ముఖాలే.. కాస్తో కూస్తో సోషల్ మీడియా, సినిమా నాలెడ్జ్ ఉంటే తప్ప తెలియని వారితో మ్యాజిక్ చేస్తూ స్లో కిక్ ఇస్తున్నారు బిగ్ బాస్. మొదట అంతగా ఆకట్టుకోకపోయినా వారం ముగిసేసరికి ఊపందుకొని ప్రేక్షకాదరణ పొందింది బిగ్ బాస్ 4. దీంతో ఈ షో రేటింగ్స్ ఎలా ఉన్నాయనే ఆసక్తి నెలకొంది జనాల్లో. ఈ నేపథ్యంలో తాజాగా రేటింగ్స్ తెలుపుతూ హూషారెత్తించారు నాగార్జున. తాజాగా బిగ్ బాస్ 4 రేటింగ్స్ తెలుపుతూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు బిగ్ బాస్. నాలుగో సీజన్ ప్రారంభ వేడుకలకు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిందని తెలిపారు. బిగ్ బాస్ ఫస్ట్ డే టిఆర్పీ పరంగా చూస్తే ఇది రికార్డు అనే చెప్పుకోవాలి. గతంలో ఏ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు ఇంత రేటింగ్ రాలేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్‌‌కి 16.18 రేటింగ్ రాగా.. నాని హెస్ట్ చేసిన రెండో సీజన్‌ 15.05 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక నాగార్జున రంగంలోకి దిగి మూడో సీజన్‌కు 17.9 రేటింగ్ రాబట్టారు. ఇప్పుడు దాన్ని మించి నాలుగో సీజన్‌లో చరిత్ర తిరగ రాశారు. Also Read: తొలి రోజు బిగ్ బాస్‌ని 4.5 కోట్ల మంది వీక్షించారని, ప్రతి ముగ్గురిలో ఇద్దరి కన్ను ఇక్కడే పడిందని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్న హోస్ట్ నాగార్జున.. ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీ అందిరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ గర్వంగా ట్వీట్ పెట్టారు. తొలివారంలో డైరెక్టర్ ఎలిమినేట్ కాగా.. ఇక ఈ షోని మరింత రంజుగా మార్చేందుకు ఒక్కో ఆయుధాన్ని బయటకు తీస్తున్నారు నాగార్జున. చూడాలి మరి ఓపెనింగ్ రికార్డ్స్ చివరిదాకా కొనసాగుతాయా లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2H6s0RH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...