Wednesday, 23 September 2020

Bigg Boss 4: మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి హాట్ హీరోయిన్!!

కింగ్ నాగార్జున్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 మంచి టీఆర్పీతో దూసుకుపోతోంది. గత మూడు సీజన్లతో పోలిస్తే మంచి కంటెస్టెంట్లు లేకపోయినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులు మాత్రం ఈ షోను బాగా ఆదరిస్తున్నారు. అంతేకాదు, కరోనా వైరస్ కారణంగా బిగ్ బాస్ షో ఆలస్యంగా ప్రారంభంకావడంతో తొలిరోజు నుంచే ఫ్యాన్స్ ఈ షోను ఎగబడి చూశారు. తొలిరోజు మొత్తం 16 మంది కంటెస్టెంట్లను హౌజ్‌లోకి పంపారు నాగార్జున. అయితే, తొలివారం డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన తరవాత అదేవారం ఇద్దరు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపారు. జబర్దస్త్ అవినాస్, కుమార్ సాయి హౌజ్‌లోకి వెళ్లి పోటీపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈవారం మరో కంటెస్టెంట్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో నటించిన హాట్ హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను వైల్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపిస్తున్నారని తెలిసింది. స్వాతి ఎంట్రీతో హాట్‌నెస్ డోస్‌ను మరింత పెంచబోతున్నారట. స్వాతి దీక్షిత్ తెలుగు, తమిళం, బెంగాలీ చిత్రాల్లో నటించారు. ‘నామ్’, ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’, ‘సింబా’ సినిమాలు స్వాతి దీక్షిత్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘జంప్ జిలానీ’ సినిమాలోనూ స్వాతి దీక్షిత్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో క్వారంటైన్ పీరియడ్‌ను స్వాతి పూర్తిచేసిందని సమాచారం. రేపు ఆమె ఎంట్రీ ఉండబోతుందట. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kGx1ir
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...