Friday, 18 September 2020

Anasuya: టాప్ డైరెక్టర్ నుంచి అనసూయకు ఆఫర్.. పెళ్లి మ్యాటర్ పక్కనబెట్టేసి! భారీ సొమ్ము పుచ్చుకుందట..

యాంకర్లంటే కేవలం మాటలతోనే కాదు అందాలతో కూడా మాయ చేసి బుట్టలో వేసేయొచ్చు అని నిరూపించింది భరద్వాజ్. బుల్లితెరపై అమ్మడి జబర్దస్తీ మామూలుగా ఉండదు లెండి. వారం వారం ఓ ప్రత్యేకమైన లుక్‌లో ఆకర్షించడం ఈ అమ్మడికే చెల్లుతుంది. ఇక ఈ జోరు చూసి సినీ దర్శకనిర్మాతలు సైతం అనసూయను వదలడం లేదు. ఆమెకు స్పెషల్ రోల్స్ ఇస్తూ బిజీ చేసేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో ఛాన్స్ పట్టేసి అట్రాక్ట్ చేసిన అనసూయ ''క్షణం, రంగస్థలం'' సినిమాలతో సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఆమెతో స్పెషల్ రోల్ చేయిస్తున్నారట టాప్ డైరెక్టర్ . 'నటసామ్రాట్' అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ కృష్ణ వంశీ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ సరసన నటిస్తోంది. చిత్రానికి ‘’ అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వర్షన్‌లో నానా పాటేకర్ పోషించిన పాత్రను ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని ఓ స్పెషల్ రోల్ కోసం అనసూయని తీసుకున్నారట కృష్ణ వంశీ. ఆమె కోసం పవర్‌‌ఫుల్ దేవదాసి రోల్ రెడీ చేసి మెప్పించారట. ఈ రోల్ కోసం అనసూయకు భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారని సమాచారం. Also Read: గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే దేవదాసి రోల్‌లో అనసూయ కనిపించనుందట. ఇందులో భాగంగా ఆమెతో ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించనున్నారట. ఈ పాటలో అందాలతో అనసూయ జబర్దస్తీ థియేటర్లను షేక్ చేస్తుందని అంటున్నారు. అనసూయ కెరీర్‌లో మైల్‌స్టోన్ రోల్ 'రంగమ్మత్త'ను మరిపించేలా ఈ 'దేవదాసి' రోల్ ఉంటుందని టాక్. ఈ పాత్రలో అనసూయ గ్లామర్ స్పెషల్ కిక్ ఇవ్వనుందని తెలుస్తోంది. Also Read: అభిషేక్ అండ్ మధు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ 'రంగమార్తాండ' సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 70 శాతం ఫినిష్ చేశారు. అతిత్వరలో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు కృష్ణ వంశీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HdmBbN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...