Wednesday, 2 September 2020

7వేల సంవత్సరాల క్రితం: ప్రభాస్ మరో అప్‌డేట్.. గెట్ రెడీ డైహార్డ్ ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ మంచి జోరు మీద ఉన్నారు. ‘సాహో’ తరవాత ప్రభాస్ నుంచి మరో సినిమా వెండితెరపై దర్శనం ఇవ్వనప్పటికీ వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈ టాలీవుడ్ రెబల్ స్టార్. ఇప్పటికే ఆయన ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తుండగా.. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో మరో సినిమాను ఆ మధ్య ప్రకటించారు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే, ఆగస్టు 18న ప్రభాస్ మరో భారీ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌తో కలిసి ప్రభాస్ ఈ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓం రౌత్, క్రిషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సహ నిర్మాతలు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. దీనికి ‘ఆదిపురుష్’ అని టైటిల్ పెట్టారు. అంతేకాదు, టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. Also Read: అయితే, ఈ చిత్రం నుంచి రేపు (సెప్టెంబర్ 3న) అప్‌డేట్ రాబోతోంది. రేపు ఉదయం 7:11 గంటలకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘‘7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు!’’ అని ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంటే, రేపు ఆ రాక్షసుడిని పరిచయం చేయబోతున్నారా? చూడాలి మరి! ఏదైతేనేం.. ‘ఆదిపురుష్’ నుంచి సర్‌ప్రైజ్ వస్తోంది. గెట్ రెడీ డైహార్డ్ ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34ZgoKq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...