Friday, 18 September 2020

నానితో మరోసారి.. సాయిపల్లవికి రూ.2కోట్ల రెమ్యూనరేషనా?

అద్భుత నటనతో, డ్యాన్సులతో దక్షిణాది సినీ తెరపై తిరుగులేని గుర్తింపు తెచ్చుకంది . ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే ఈ అమ్మడు తన టాలెంట్‌నే నమ్ముకుని దూసుకుపోతోంది. ‘ఫిదా’తో అందరినీ ఫిదా చేసిన సాయిపల్లవికి ఆ తర్వాత వరుస అవకాశాలు చుట్టుముట్టినా తొందరపడలేదు. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే కనిపిస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. Also Read: ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగచైతన్య పక్కన ‘లవ్‌స్టోరీ’లో నటిస్తోంది సాయిపల్లవి. తాజాగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండగా సాయిపల్లవిని మెయిన్ హీరోయిన్‌‌గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.2కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అదితిరావు హైదరీని తీసుకోనున్నట్లు సమాచారం. సాయిపల్లవి గతంలో ‘ఎంసీఏ’ సినిమాలో నాని పక్కన నటించింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3muKrjf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...