Wednesday, 19 August 2020

Prabhas: ఆదిపురుష్.. సీతదేవిగా కీర్తి సురేష్?

బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ ఆఫ్ ది డికేట్ అంటూ యంగ్ రెబల్ స్టార్ ‘ ’ చిత్రంతో సర్ ప్రైజ్ చేశారు. 'చెడుపై మంచి సాధించే విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకుందాం' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ‘ఆది పురుష్’ లోగో టైటిల్‌ని విడుదల చేశారు. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో రూపొందనున్న ఈ 'ఆదిపురుష్' సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తు ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆదిపురష్ టైటిల్ లోగో సైతం.. సోషియో ఫాటసీ కథా నేపథ్యంలోనే ఉండటంతో ప్రభాస్.. విష్ణు అవతారమైన రాముడి పాత్రను పోలిన పాత్రను ఇందులో పోషిస్తాడని తెలుస్తోంది. అయితే రాముడికి సీతగా ఎవరు నటిస్తారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. అయితే ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రకోసం పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ 20 మూవీ రాధేశ్యామ్ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రభాస్-నాగ అశ్విన్ కాంబో 21వ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ప్రభాస్ 22వ మూవీలో సీత పాత్రకు ‘మహానటి’ కీర్తి సురేష్ అయితే బెటర్ అని భావిస్తున్నారట మేకర్స్. అయితే బాలీవుడ్ భామలు చాలామంది సీత రోల్‌ కోసం పోటీ పడుతుండగా.. ప్రభాస్ కూడా కీర్తివైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/323YanY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...