Monday, 3 August 2020

Nani: నానితో డీల్ సెట్ చేసుకున్న మారుతి.. ప్రేక్షకులు మెచ్చిన ఆ కాంబో రిపీట్!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాచురల్ స్టార్ మరో సినిమాను లైన్‌లో పెట్టారని తెలుస్తోంది. ఈ తరం ప్రేక్షకులకు కావాల్సిన కథలను అందిస్తూ సూపర్ హిట్స్ సాధిస్తున్న డైరెక్టర్ మారుతితో ఆయన డీల్ కుదుర్చుకున్నారనేది లేటెస్ట్ టాక్. అవును.. ఇప్పటికే 'భలే భలే మగాడివోయ్' సినిమాతో లాఫింగ్ ట్రీట్ ఇచ్చిన ఈ కాంబో మరో సినిమాతో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం. నాని కోసం డైరెక్టర్ ఓ పవర్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారట. ఈ లాక్‌డౌన్ సమయంలోనే నానికి ఆ కథ వినిపించారట. మారుతి చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో.. నాని కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఫిలింనగర్ టాక్. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించి.. నటీనటులకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారని తెలిసింది. Also Read: ప్రస్తుతం నాని నటించిన ''మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మోహన‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా రూపొందింది. చాలారోజుల క్రితమే షూటింగ్ ఫినిష్ చేసుకొని లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో విడుదల కాలేదు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' మూవీ చేస్తున్నారు నాని. దీంతో థియేటర్స్ ఓపెన్ కాగానే వెండితెరపై నాని హంగామా చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33mdjmW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...