ఓ స్టార్ హీరో పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఆయన కొత్త సినిమా నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్ వస్తుందా? ఆయనిచ్చే ట్రీట్ ఎలా ఎంజాయ్ చేయాలి? అని కొన్ని రోజుల ముందునుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటాయి ఆ హీరో అభిమాన వర్గాలు. ఈ క్రమంలోనే మరో ఆగస్టు 9న సూపర్ స్టార్ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ '' నుంచి ఏ అప్‌డేట్ ఇవ్వబోతున్నారనే దానిపైనే అందరి దృష్టి పడింది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ టీమ్ సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అయ్యేలా ఓ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ రెడీ చేస్తోందని తెలిసింది. మే 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజున 'సర్కారు వారి పాట' టైటిల్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న చిత్రయూనిట్.. ఆగస్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ట్రాక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుండటంతో మహేష్ బర్త్ డే సర్‌ప్రైజ్ ఉండకపోవచ్చనే వార్తలు విన్నాం. కానీ మహేష్ ఫ్యాన్స్‌ని నిరాశ పరచొద్దు అనే కోణంలో ఆలోచించి టైటిల్ ట్రాక్ విడుదల చేయాలని ఫిక్సయ్యారట మేకర్స్. Also Read: మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. విలన్ పాత్ర కోసం పవర్‌ఫుల్ యాక్టర్ వేట ప్రారంభించిన పరశురామ్.. అరవింద స్వామి, ఉపేంద్ర, సుదీప్‌లలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలని చూస్తున్నారట. కరోనా ఎఫెక్ట్ తగ్గాకే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని చూస్తున్నారట దర్శకనిర్మాతలు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gBvrg9
v
No comments:
Post a Comment