అందానికే అసూయ కలిగించే తన లవ్ స్టోరీ గురించి చెబుతూ ఓపెన్ అయింది. తాజాగా '' ప్రోగ్రాంలో ఆలీతో సరదాగా ముచ్చటించింది. కెమెరా కనిపిస్తే చాలు అందాలతో ఆకట్టుకోవడానికే ప్రయత్నించే ఈ జబర్దస్త్ బ్యూటీ.. తాజా ప్రోగ్రాం లోనూ కవ్వించే ఖతర్నాక్ డ్రెస్స్ వేసి కళ్ళు తిప్పుకోకుండా చేసేసింది. ఇక ఆలీ పంచులు, అనసూయ ముద్దు ముద్దు ముచ్చట్లతో ఆద్యంతం ఆకట్టుకున్న ఈ షోలో అనసూయ చెప్పిన ప్రేమ ముచ్చట్లు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. టీవీ ఇండస్ట్రీకి రాకముందు తాను బ్యాంకులో టెలీకాలర్‌గా చేశానని అనసూయ చెబుతుండగా.. మెల్లగా అక్కడేనా? అంటూ ఆమె ప్రేమ సంగతులు రాబట్టే రాయి వేసేశాడు ఆలీ. దీంతో ఎంతో ఉత్సాహంగా వెంటనే ఓపెన్ అయిన అనసూయ.. తాను ఎన్‌సిసిలో ఉండగా సుశాంక్‌ని కలిశానని, ఆయన్ను కలిసినప్పుడు తన వయస్సు 15 ఏళ్లు మాత్రమే అని చెప్పింది. తాను పాతదనం, కొత్తదనం కలిసి ఉన్న అనసూయను అని పేర్కొంటూ తన లవ్ స్టోరీ అంతా చెప్పేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ. సుశాంక్ తనకు ఐ లవ్ యూ.. అని చెప్పకుండా డైరెక్టుగా పెళ్లి చేసుకుందామా? అనే ప్రపోజ్ చేశాడు. అక్కడే నాకు నచ్చాడు. అయితే సుశాంక్ ప్రపోజ్ చేసిన వెంటనే మొదట అమ్మతోనే ఆ విషయాన్ని చెప్పానని తెలిపింది అనసూయ. మేం ముగ్గురం ఆడపిల్లలమే కావడంతో మా నాన్న గారు మమ్మల్ని బావిలో కప్పల్లా పెంచారు. దాంతో పాటు తన కూతుళ్లు ఎవ్వరికీ భయపడొద్దు అని భావించేవారని, అందుకే తాను ఆటో మాట్లాడుకోవడం కూడా పదో తరగతిలోనే నేర్చుకున్నానని అనసూయ చెప్పింది. అయితే తాను ఆటో మాట్లాడుతుంటే మా నాన్న గారు గల్లీ కార్నర్‌లో ఉండి చూసేవారని.. ఎలా డీల్ చేస్తోంది? మా అమ్మాయిని వాడేలా చూస్తున్నాడు? ఇవన్నీ గమనించేవారని చెప్పింది. Also Read: ఆ తర్వాత ఎంబీఏ, చిన్న ఉద్యోగం.. ఎన్నో కష్టాలు పడ్డా.. ఇక నా వల్ల కావట్లేదు పెళ్లి చేసుకుందాం అంటే, ఆయన మాత్రం రెస్పెక్ట్ ఉండదు వెయిట్ చేద్దాం అనేవారని అనసూయ చెప్పుకొచ్చింది. తాను కూడా చేసుకుంటే ఆయనను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయ్యానని, అలా తొమ్మిదేళ్లు చాలా స్ట్రగుల్స్ చేసి సుశాంక్‌కి పెళ్లి చేసుకున్నానని చెప్పింది. పెళ్లిలో కూడా మా నాన్నగారు అయిష్టంగానే ఉన్నారని, పిల్లలు పుట్టాక నాన్న మాతో మునుపటిలా ఉన్నారని ఆమె చెప్పింది. ఆ రోజు గనక మేము చెప్పకుండా పెళ్లి చేసుకుంటే.. ఈ రోజు ఆ రెస్పెక్ట్, తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయే వాళ్ళమేమో అని అనసూయ తెలిపింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34rj8jn
v
No comments:
Post a Comment