Sunday, 9 August 2020

మహేష్ బాబును లెజెండ్ అన్న డేవిడ్ వార్నర్.. ‘మైండ్ బ్లాక్’ బర్త్‌డే విషెస్

ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ద్వారా తెలుగు క్రికెట్ అభిమానులకు దగ్గరైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల పాటలకు తన భార్య క్యాండైస్‌తో కలిసి స్టెప్పులేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మహేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబును ‘లెజెండ్’ అని పేర్కొన్నారు. ‘మైండ్ బ్లాక్’ పాటలో మహేష్ బాబు, రష్మిక మందన వేసినట్టే స్టెప్పులేశారు డేవిడ్ వార్నర్, క్యాండైస్. వార్నర్ దంపతులు డ్యాన్స్ చేస్తుంటే వెనుకే చిన్నారి కూతుళ్లు కూడా మైండ్ బ్లాక్ స్టెప్‌తో అదరగొట్టారు. ఈ వీడియో విషెస్ మహేష్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 7.5 లక్షల లైకులు ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు వచ్చాయి. డ్యాన్స్ అదిరిపోయింది అంటూ మహేష్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. కాగా, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఇక ఫ్యాన్స్ అయితే #HBDMaheshBabu ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఏకంగా 24 గంటల్లో 60.2 మిలియన్లకు పైగా ట్వీట్లు చేశారు. ట్విట్టర్ చరిత్రలోనే ఒక హ్యాష్‌ట్యాగ్‌తో 24 గంటల్లో ఇన్ని ట్వీట్లు చేయడం ఇదే తొలిసారి. ఈ రికార్డ్‌తో మహేష్‌ బాబుకు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు ఫ్యాన్స్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XGXoM0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...