మంచువారింట పండుగ వాతావరణం నెలకొంది. చిన్న కుమార్తె ఐరా విద్య ఆదివారం (ఆగస్టు 9న) ఒకటో ఏట అడుగుపెట్టింది. ఐరా తొలి పుట్టినరోజును మంచు ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంటోంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఐరా తొలి పుట్టినరోజు వేడుకను జరుపుతున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో మంచు ఫ్యామిలీతో పాటు, విష్ణు అత్తామామలు కూడా పాల్గొంటున్నారు. ఐరా తొలి పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న ఫొటోలను మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. Also Read: విష్ణు ట్వీట్ చేసిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయి. ఈ ఫొటోల్లో మంచువారు ముత్యాల్లా మెరిసిపోతున్నారు. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫొటోలు చాలా బాగున్నాయి అంటూ పొగిడేస్తున్నారు. సినీ రచయిత బీఎస్‌వీ రవి అయితే.. ‘‘ఇవి మీ మొత్తం ఆల్బమ్‌లో అత్యంత అందమైన ఫొటోలు కాదు కదా. మీతో పాటు మీ ఆల్బమ్‌కి కూడా దిష్టి తీయించుకోండి. హ్యాపీ బర్త్‌డే ఐరా’’ అని కామెంట్ చేశారు. దీన్ని బట్టి ఆ ఫొటోలు ఎంతగా ఆకర్షిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా, మంచు విష్ణు-విరానికా దంపతులకు ఐరా విద్య నాలుగో సంతానం. 2009 మార్చి 1న విష్ణు, విరానికా వివాహం హైదరాబాద్‌లో జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు 2011 డిసెంబర్‌లో తొలి సంతానంగా అరియానా, విరియానా కవల ఆడపిల్లలు జన్మించారు. ఆ తరవాత 2018 జనవరిలో కుమారుడు అవ్‌రామ్‌కు విరానికా జన్మనిచ్చారు. దీంతో మంచువారింట వారసుడు పుట్టాడని సంబరపడ్డారు. అయినప్పటికీ తమకు మరో సంతానం కావాలని విష్ణు-విరానికా కోరుకున్నారు. 2019 ఆగస్టు 9న ఐరా విద్య జన్మించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CfOZYE
v
No comments:
Post a Comment