Thursday, 27 August 2020

'అల.. వైకుంఠపురములో' నయా సెన్సేషన్.. బాహుబలి రికార్డు బద్దలు కొట్టేస్తూ న్యూ ఫీట్

ఈ ఏడాది ఆరంభంలో విడుదలై టాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డుల సునామీ సృష్టించింది '' మూవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచి పెట్టిన ఈ మూవీ తాజాగా బాహుబలి రికార్డును కూడా బద్దలు కొట్టేసింది. విడుదలై 7 నెలలు గడిచి పోయినా నేటికీ సత్తా చాటుతూ రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది 'అల.. వైకుంఠపురములో' సినిమా. ముఖ్యంగా మ్యూజిక్ పరంగా సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తూ సరికొత్త ఫీట్స్ అందుకొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెరపై కూడా టీఆర్ఫీ పరంగా న్యూ రికార్డు క్రియేట్ చేసింది. థియేటర్లలో విడుదలై 7 నెలలు, ఓటీటీలో రీలీజై 6 నెలలు అయినప్పటికీ బుల్లితెరపై `అల వైకుంఠపురములో..` రికార్డు స్థాయిలో 29.4 టీఆర్పీ సాధించిందని పేర్కొంటూ.. ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచిందని తెలిపింది చిత్రయూనిట్. ఈ మేరకు మీ ప్రేమకు, ఆదరణకు ధన్యవాదాలు అని చెబుతూ చిత్ర నిర్మాత నాగ వంశీ ట్వీట్ చేశారు. Also Read: గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ టబు, కమెడియన్ సునీల్ కీలక పాత్రలు పోషించారు. ''జులాయి, S/O సత్యమూర్తి'' సినిమాల తర్వాత బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో హాట్రిక్ హిట్ మూవీగా నిలిచింది అల.. వైకుంఠపురములో మూవీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32pzOFi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...