Tuesday, 11 August 2020

టక్ జగదీష్: ఆ రూమర్‌కు చెక్ పెట్టిన నాని టీం

నేచురల్ స్టార్ ప్రస్తుతం ‘టక్ జగదీష్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. నానితో గతంలో ‘నిన్ను కోరి’ సినిమా చేసిన శివ నిర్వాణ ఇప్పుడు ‘టక్ జగదీష్’కు దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. లాక్‌డౌన్‌కు కొద్ది రోజుల ముందే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఒక గాసిప్ బాగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాని బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే కుర్రాడి పాత్రలో కనిపిస్తారని వదంతులు వచ్చాయి. అయితే, ఈ రూమర్‌ను నాని టీమ్ కొట్టిపారేసింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. నాని అదిరిపోయే ఎంటర్‌టైనింగ్ రోల్‌లో కనిపిస్తారని స్పష్టం చేసింది. నాని పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పింది. ‘టక్ జగదీష్’ సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉంటుందని, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని నాని టీమ్ వెల్లడించింది. అలాగే, రొమాన్స్, కామెడీకి కూడా లోటు ఉండదని పేర్కొంది. శివ నిర్వాణ సినిమాల్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ ‘టక్ జగదీష్’లో నానిని మునుపెన్నడూ చూడని విధంగా చూపిస్తారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33QG0Iz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...