Friday, 21 August 2020

వెండితెరపై దేవినేని నెహ్రూ లైఫ్ స్టోరీ.. రంగంలోకి నందమూరి తారకరత్న.. ఇదీ లేటెస్ట్ అప్‌డేట్

ప్రముఖ రాజకీయ నాయకుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'. ''బెజవాడ సింహం'' అనేది ట్యాగ్ లైన్. జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నర్రా శివ నాగేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు మహనాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ను జోడిస్తూ ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బెజవాడ లోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఇక 1983లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కెఎస్ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తుండటం విశేషం. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ కంప్లీట్ అయింది. Also Read: ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.. చిత్రంలోని నటీనటులంతా చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, నందమూరి తారక రత్న నిజమైన నెహ్రూ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడు. అలాగే సురేంద్ర పాత్రలో ఏంఎన్ ఆర్ చౌదరి నటిస్తున్నారు. దేవినేని మురళిగా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, మిగతా పాత్రల్లో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ మొత్తం ఫినిష్ చేశాము. డిటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ని త్వరలోనే విడుదల చేయనున్నాం'' అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gje82D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...